- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గిన మారుతీ వాహనాల ఉత్పత్తి
ముంబయి: గత నెలలో ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిలో 19.30శాతం వార్షిక క్షీణత(Annual decline) నమోదైనట్టు మారుతీ సుజుకీ (Maruti Suzuki)ఇండియా తెలిపింది. గత నెలలో 1,05,345 ప్యాసింజర్ వాహనాల (Cars, Utility Vehicles, Vans)ను ఉత్పత్తి చేసినట్లు రెగ్యులేటరి ఫైలింగ్‌లో పేర్కొంది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (Financial year) ఇదే నెలలో 1,30,541 వాహనాలను ఉత్పత్తి (Product)చేయడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్, సరఫరా చెయిన్ దిబ్బతినడంతో వాహనాలు గిరాకీ దెబ్బతిన్నది. ఈ ప్రభావం కార్ల ఉత్పత్తిపై చూపిందని, 2003 తర్వాత మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి పడిపోవడం ఇదే ప్రథమమని దేశంలోనే అతిపెద్ద వాహనాల ఉత్పత్తిదారు మారుతీ సుజుకీ నివేదించింది.
ఆల్టో, ఎస్-ప్రస్సో, వాగన్‌ఆర్, స్విఫ్ట్ బలెనో, డిజైర్, సియాజ్(Alto, S-Presso, Wagon R, Swift Baleno, Dzire, Ciaz) మోడళ్ల కార్ల ఉత్పత్తి గత నెలలో 21.89శాతం పడిపోయి, 77,507 యూనిట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో ఈ వాహనాల ఉత్పత్తి 99,230 యూనిట్లుగా ఉన్నది. చిన్న కార్ల విభాగంలో మిగతా వాటితో పోల్చితే ఆల్టో, ఎస్-ప్రెస్సో మోడళ్ల ఉత్పత్తి 23.32శాతం పెరిగి, 20,368 యూనిట్లుగా ఉన్నదని మారుతీ సుజుకీ తెలిపింది.
అయితే కంపాక్ట్ విభాగంలో 29.88శాతం తగ్గి 55,390 యూనిట్లుగా ఉన్నది. ఈ విభాగంలో వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బలెనో, డిజైర్ (WagonR, Celerio, Ignis, Swift, Baleno, Dzire)మోడళ్లు ఉన్నాయి. ప్యాసింజర్, తేలికపాటి వాణిజ్య వాహనాల మొత్తం ఉత్పత్తి 19.19శాతం తగ్గి 1,07,687 యూనిట్లుగా ఉన్నది.