- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంతగూటికి..‘మార్స్’ రాయి
అంగారక గ్రహం మీది నుంచి భూమ్మీద పడిన ఒక రాయిని తిరిగి తన సొంత గ్రహానికి నాసా పంపించబోతోంది. పది పైసల నాణెం సైజులో ఉన్న ఈ రాయిని అమెరికా రోబో ప్రోబ్ ద్వారా గురువారం సొంతగూటికి వెళ్లబోతోంది. ఏడు నెలల పాటు ప్రయాణం చేసి ఈ రాయి మార్స్ మీద అడుగుపెడుతుంది. ఇంతకీ దీన్ని పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనుకుంటున్నారా? త్వరలో ప్రారంభంకానున్న మార్స్ 2020 ఎక్స్‌పెడిషన్‌లో ఈ రాయి ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ ఎక్స్‌పెడిషన్‌లో ఉపయోగించే రోబోలు, సెన్సార్లు అన్ని పనిచేయాలంటే ముందు వాటిని ఆ గ్రహానికి చెందిన పదార్థాలతో క్యాలిబరేట్ చేయాల్సిఉంటుంది. భూమ్మీద దొరికే రాళ్లతో ఆ రోబో ప్రోబ్‌లను క్యాలిబరేట్ చేస్తే, తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అక్కడే పుట్టిన ఈ రాయితో క్యాలిబరేట్ చేస్తారు.
6 లక్షల ఏండ్ల కిందట అంగారక గ్రహం మీద ఒక పెద్ద ఉల్క పడినపుడు ఎన్నో శకలాలు విశ్వాంతరాలంలో పడ్డాయి. వాటిలో ఒక శకలం భూమ్మీదకు వచ్చి పడింది. ఎస్ఏయూ 008గా పిలిచే ఈ రాయిని 1999లో ఒమన్‌లో కనిపెట్టారు. నిర్మాణంలో తేమ బుడగలతో అచ్చం అంగారక గ్రహం మీది రాళ్లను పోలి ఉండటంతో ఇది కచ్చితంగా ఆ గ్రహానికే చెందినదని 2000 సంవత్సరంలో శాస్త్రవేత్తలు కనిపెట్టి నేచురల్ హిస్టరీ మ్యూజియానికి పంపించారు. ఇప్పుడు రాళ్లను కచ్చితంగా విశ్లేషించగల షేర్లాక్ అనే లేజర్ టెలిస్కోప్‌ను క్యాలిబరేట్ చేయడానికి ఈ రాయిని మ్యూజియం వారు నాసాకు బహుమతిగా ఇచ్చారు. అందుకో ఆ టెలిస్కోప్‌తో పాటు రాయిని కూడా శాస్త్రవేత్తలు మార్స్‌కి పంపిస్తున్నారు.