- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరకట్న వేధింపులకు మరో వివాహిత బలి..
దిశ, కొడిమ్యాల : కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు మరో వివాహిత బలైంది. ఈ ఘటన జిల్లాలోని కొడిమ్యాల మండలం సండ్రాళ్ల పల్లి గ్రామంలో వెలుగుచూసింది. కొడిమ్యాల ఎస్‌ఐ శివాని రెడ్డి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లతను(33) సండ్రాళ్లపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డికి ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లయిన కొద్ది రోజులు వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. అయితే, అత్తింటివారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదనపు కట్నం తేవాలని వివాహితను వేధింపులకు గురిచేశారు.
చాలా రోజులు భరించిన లత చివరకు చేసేదేమీ లేక తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటలకు మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శివాని రెడ్డి తెలిపింది.