కోర్టుకెక్కిన పురుష జంట

by Shamantha N |
కోర్టుకెక్కిన పురుష జంట
X

దిశ, వెబ్‌డెస్క్: తమ వివాహానికి చట్ట ప్రకారం గుర్తింపు ఇవ్వాలని ఓ మగ జంట కోర్టుకెక్కింది. ఫారిన్ మ్యారేజ్ యాక్ట్, 1969 ప్రకారం గుర్తించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. గతంలో వివాహం చేసుకునేందుకు న్యూయార్క్ లోని ఇండియన్ కాన్సులే‌ట్‌ను సంప్రదిస్తే.. సెక్సువల్ ఓరియంటేషన్ కింద దరఖాస్తును తిర్కరించారని కోర్టుకు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకునే హక్కు ఉందని.. కానీ, ఇండియన్ కాన్సులేట్‌ తమ ధరఖాస్తును తిరస్కరించడం ఉల్లంఘించినట్లేనని అభిప్రాయపడ్డారు. కాగా, ఒక భారతీయ పౌరుడు, మరొక భారత దేశపు ఓవర్సీస్ పౌరుడు వివాహం చేసుకున్నారు. అయితే, వారి పెండ్లికి గుర్తింపు ఇవ్వాలని పిటిషన్ వేయడం గమనార్హం. దీని పై ఢిల్లీ కోర్టు వచ్చే వారం విచారణకు తీసుకురానుంది.

Advertisement

Next Story

Most Viewed