- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్‌బీఐ నిర్ణయంతో స్పీడందుకున్న మార్కెట్!
ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో కీలకమైన వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం కంటే అధికంగా ఉండటంతో వడ్డీరేట్లలో మార్పులేమీ చేయడం లేదని స్పష్టం చేసింది. దీంతో ఉదయం వరకూ స్థిరంగా ఉన్న మార్కెట్లో కొనుగోళ్లు పెరిగాయి. ప్రధానంగా వడ్డీరేట్ల మార్పులపై ఆధారపడే ఆర్థిక, రియలిటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు కొనడానికి మదుపర్లు ముందుకొచ్చారు. మధ్యహ్న భోజనాల సమయానికి సెన్సెక్స్ 203 పాయింట్ల లాభంతో 41,345 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 12,147 వద్ద ట్రేడవుతోంది.
బ్యాంకింగ్ రంగం షేర్లు అనూహ్యంగా పెరగడంతో నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ 31,160 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ఫైనాన్స్, ఫార్మా ఇండెక్స్, మెటల్ ఇండెక్స్ షేర్లు ఒక శాతానికి మించి లాభాల్లో ట్రేడవుతున్నాయి. వినియోదారు వస్తువుల రంగం(MFCG) షేర్లు మాత్రమే కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మార్కెట్ సూచీల్లో యస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, జీ లిమిటెడ్ షేర్లు 2 శాతానికి మించి లాభాల్లో కొనసాగుతుంటే, టైటాన్, టాటా మోటార్స్, హిందాల్‌కో, ఇన్ఫోసిస్ షేర్లు సుమారు 2 శాతం వరకు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.