మర్కజ్ మసీదు మౌలాపై ఎఫ్ఐఆర్

by Shamantha N |
మర్కజ్ మసీదు మౌలాపై ఎఫ్ఐఆర్
X

దేశంలో కరోనా కేసులకు బీజం వేసిన మర్కజ్ మసీద్ మౌలాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మర్కజ్ మసీదులో మార్చి 10న తబ్లీఘీ-జామాత్ ప్రార్థనల కోసం విదేశాల నుంచి మత బోధకులు హాజరయ్యారు. వీరి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. ఆగ్రహించిన ఢిల్లీ ప్రభుత్వం కేసు నమోదు చేయాల్సింది ఆదేశించింది. తబ్లీఘీ-జామాత్ ప్రార్థనల్లో పాల్గొన్న 1200 మందిని క్వారంటైన్ కు తరలించి వారిని పరీక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ హాజరైయ్యారు. దేశంలోని కరోనా పాజిటివ్ కేసులకు మూలం తబ్లీఘీ-జమాత్ ప్రార్థనలే. తెలంగాణ, కశ్మీర్ లో మృతి చెందిన వారంతా ఈ ప్రార్థనలకు వెళ్లిన వారే. ఈ నేపథ్యంలో నిజాముద్దీన్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు పటిష్ట నిఘా ఉంచారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రార్థనలకు వెళ్లిన వారి సమచారం తెలపాల్సిందిగా ట్విట్టర్ వేదికగా అభ్యర్థిస్తున్నారు.

Tags: markaj masjid,case file,moula,alerady two death’s,corona virus

Advertisement

Next Story