- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడు నెలల కనిష్టానికి తయారీ కార్యకలాపాలు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి మరోసారి వ్యాప్తిస్తుండటంతో ఆర్థికవ్యవస్థలో డిమాండ్‌కు ఆటంకం ఏర్పడింది. దీంతో భారత తయారీ రంగ కార్యకలాపాల్లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వృద్ధి వేగం మార్చిలో 7 నెలల కనిష్టానికి పడిపోయినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా సోమవారం వెల్లడించింది. ఫిబ్రవరిలో ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యూఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 57.5 నమోదవగా, మార్చిలో ఏడు నెలల కనిష్టంతో 55.4కి చేరుకుంది. పీఎంఐ స్వల్పంగా తగ్గినప్పటికీ తయారీ రంగం గణనీయమైన మెరుగుదలను సూచిస్తోందని నివేదిక అభిప్రాయపడింది.
పీఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే ఎక్కువగా నమోదైతే ఆ రంగం వృద్ధిని సూచిస్తుంది. 50 పాయింట్ల లోపు ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. ఉత్పత్తి, కొత్త ఆర్డర్లు, ఇన్‌పుట్ కొనుగోలు అంశాలు తయారీ రంగం మెరుగైన వృద్ధికి కారణం. అయితే, ఇటీవల తిరిగి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనివల్ల డిమాండ్ తగ్గిపోవచ్చని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొల్యానా డిలిమా చెప్పారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తుండటంతో ఏప్రిల్‌లో తయారీ రంగం సవాళ్లన్ను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే, ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. పరిశ్రమలో తయారీ అవసరమైనంతగా లేకపోవడంతో ఉపాధి తగ్గిపోయింది. దీంతో గతేడాది మార్చి నాటి పరిణామాలు ఎదురవొచ్చని సర్వే భావిస్తోంది.