- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మార్చి జీఎస్టీ వసూళ్లపై కరోనా ఎఫెక్ట్
తెలంగాణలో 9శాతం నెగెటివ్ వృద్ధి
దిశ, న్యూస్ బ్యూరో : కరోనా దెబ్బ దేశం, రాష్ట్రంలో మార్చి నెల జీఎస్టీ వసూళ్ల మీద పడింది. తెలంగాణలో మార్చి నెల జీఎస్టీ కలెక్షన్లు గత సంవత్సరంతో పోలిస్తే నెగెటివ్ వృద్ధి సాధించాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం మార్చితో పోలిస్తే 2019-20 మార్చిలో ఈ కలెక్షన్లు 9 శాతం తగ్గి రూ.3563 కోట్లకు చేరాయి. ఇవే కలెక్షన్లు గత ఆర్థిక సంవత్సరం మార్చిలో రూ.3897 కోట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరం వారిగా చూస్తే మాత్రం తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో జీఎస్టీ కలెక్షన్లు రూ.39820 కోట్లు వసూలై 9 శాతం వృద్ధి నమోదు చేశాయి. అంతకముందు ఆర్థిక సంవత్సరంలో ఈ కలెక్షన్లు రూ.36వేల408కోట్లుగా ఉన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా సైతం మార్చి నెల జీఎస్టీ కలెక్షన్లు 2018-19తో పోలిస్తే 4 శాతం తగ్గి రూ.78వేల700కోట్లు వసూలయ్యాయి. అయితే మొత్తం ఆర్థిక సంవత్సరం నమోదైన కలెక్షన్లు మాత్రం అంతకముందు ఏడాది కంటే 8 శాతం వృద్ధి నమోదు చేసుకొని రూ.9లక్షల44వేల 414కోట్ల ఆదాయం వచ్చింది.
Tags: corona, lockdown, march gst collections, telangana, countrywide