ఎస్ఐను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..

by Shyam |
ఎస్ఐను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఎస్ఐని కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. వివరాల ప్రకారం..పాలనార్ గ్రామంలో ఇంటి వద్ద ఉన్న ఎస్ఐ మురళిని సాయుధ నక్సల్స్ తమ వెంట తీసుకెళ్ళినట్లు సమాచారం. ఈ ఘటన గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీస్ కిడ్నాప్‌ని బీజాపూర్ ఎస్‌పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు. కిడ్నాప్‌కి గురైన ఎస్ఐ కోసం అన్వేషణ కొనసాగుతోందని చెప్పారు. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.

Advertisement

Next Story