- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోలీసులను హతమార్చేందుకు మావోల భారీ ప్లాన్
దిశ, భద్రాచలం : చర్ల అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పెనుప్రమాదం తప్పింది. అడవుల్లో గాలింపు చర్యలకు వచ్చే పోలీసులను హతమార్చడం కోసం మావోయిస్టులు భూమిలో పాతిపెట్టిన బూబీట్రాప్స్‌ను భద్రతా దళాలు గుర్తించాయి. వీటిని చర్ల సీఐ అశోక్, ఎస్ఐ రాజువర్మల నేతృత్వంలో కూంబింగ్ పార్టీ వెలికితీసింది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. చర్ల – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా.. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో చర్ల సీఐ అశోక్, ఎస్ఐ రాజువర్మ సిబ్బందితో వెళ్ళి అటవీప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే పూసుగుప్ప (తెలంగాణ), రాంపురం (ఛత్తీస్‌గఢ్) గ్రామాల నడుమ దారి ప్రక్కన అడవుల్లో కూంబింగ్‌కి వచ్చే పోలీసులను హతమార్చడానికి మావోయిస్డులు భూమిలో అడుగడుగునా బూబీట్రాప్స్ అమర్చారు. పోలీసులు వాటిని గుర్తించి 78 చోట్ల పెద్దపెద్ద గోతుల్లో ఉన్న 100 బూబీట్రాప్స్ వెలికితీశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్, దామోదర్, ఆజాద్, శారదక్కల ఆదేశం మేరకు రాంపురం, భీమారం, పూసుగుప్ప గ్రామాల మిలీషియా సభ్యులు, మావోయిస్డు దళ సభ్యులు కలిసి ఈ బూబీట్రాప్స్ అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.