21న ‌బంద్‌కు మావోయిస్టుల పిలుపు

by Sridhar Babu |
Maoists 21st bandh
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా సిల్గేర్ కాల్పుల ఘటనకి నిరసనగా ఈనెల 21న సుక్మా, బీజాపూర్ జిల్లాల బంద్‌కి మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య దక్షిణ సబ్‌జోనల్ బ్యూరో పేరుతో ప్రకటన విడుదల చేశారు. సిల్గేర్‌‌లో పెట్టిన సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఎత్తివేయాలని ప్రజలు చేపట్టిన ఆందోళనలో చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వారు మావోయిస్టు సభ్యులని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఘటనని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. సిల్గేర్ క్యాంపు ఎత్తివేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపి ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైన పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు.

Letter from the Maoists

Advertisement

Next Story