రాకెట్ లాంచెర్‌తో పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టుల దాడి

by Shyam |
రాకెట్ లాంచెర్‌తో పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టుల దాడి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా గట్టా పోలీస్ స్టేషన్‌పై బుధవారం అర్ధరాత్రి మావోయిస్టులు దాడి చేశారు. హ్యాండ్ మేడ్ రాకెట్ లాంచర్‌ను మావోయిస్టులు ప్రయోగించారు. అయితే లాంచర్ స్టేషన్ గోడకు తగలడంతో గోడపై రంధ్రం పడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం, ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్ కెమెరాలతో అడవిలో మావోయిస్టులపై దాడి చేస్తున్నారని ఆరోపణలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే హ్యాండ్ మేడ్ లాంచర్‌తో పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడడం గమనార్హం. డ్రోన్ దాడులకు ప్రతీకారంగా డైరెక్ట్ పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్‌ దాడికి మావోయిస్టులు పూనుకున్నట్టు స్పష్టమవుతోంది.

Advertisement

Next Story