30 మంది మిలీషియా సభ్యులు లొంగుబాటు

by Shyam |
30 మంది మిలీషియా సభ్యులు లొంగుబాటు
X

దిశ,కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 33 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు ఎస్పీ సునీల్ దత్ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్బంగా ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ…వీరంతా రెండేండ్లుగా మావోయిస్టు మిలీషియా గ్రామ కమిటీ సభ్యులుగా… చర్ల ఏరియా కమిటీ సెక్రెటరీ అరుణ కోసం పని చేస్తున్నారని తెలిపారు. వారిలో కొంతమందిపై అనేక కేసులు నమోదైనట్టు చెప్పారు. లొంగిపోయిన వారిలో
పురం రాజయ్య (30), కల్లూరి రాజబాబు (26), తుర్రం బాబురావు (32),సున్నం రాజారావు (22),శ్యామల బాలకృష్ణ (19) , గుర్రం జంపు (19) , సున్నం రాజబాబు (22),కల్లూరి మురళి( 22),ఇర్ప అర్జున్ (21), కొమరం బాసు (19) , కరక సమ్మయ్య (34), కనితి ఆంజనేయులు (23), సున్నం నరసింహారావు (19), కల్లూరి పవన్ (20), ఇర్ప ప్రసాద్ (19), గట్టుపల్లి రామారావు ( 22), కల్లూరి శ్రీను ( 19), మీడియం రామారావు ( 25), తుర్రం సర్వేశ్వరరావు ( 25), కణితి మురళి ( 19), తుర్రం రాము ( 27), కారం వెంకటేష్ ( 22), కొమరం రాజబాబు ( 20), యసం వీరయ్య ( 27), మీడియం వెంకట్రావు ( 30), సోడి ఉంగయ్య మహేష్ ( 20), బడిష రమేష్ ( 20), మడకం లక్ష్మయ్య ( 32), దేరేదో దేవా ( 19), మడకం ఐతయ్య ( 30), అడివి గంగయ్య ( 38), మడకం భద్రయ్య ( 50),మడకం చెన్నయ్య ( 35) ఉన్నారు.

వీరంతా మావోయిస్టు పార్టీ కోసం పని చేస్తూ వారికి నిత్యావసర సరుకులు ఆయుధాలు సమకూరుస్తూ మావోయిస్టు పార్టీలో ఎంతో చురుగ్గా పనిచేసేవారని తెలిపారు. కాగా పోలీసులు కృషితో వీరంతా మెరుగైన జీవనం గడపాలనే నిర్ణయానికి వచ్చి..జన జీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకుని లొంగిపోయినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed