- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతమయ్యాడు. దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలంగనార్ అటవీ ప్రాంతంలో కట్టేకళ్యాణ్-కంగదర్ గట్టీ ఏరియా కమిటీకి చెందిన కొంతమంది మావోయిస్టులు సమావేశం అయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు.
ఈ క్రమంలో అర్థరాత్రి సమయంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నాలుగు గంటల పాటు ఇవి చోటుచేసుకోగా.. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పీఎల్‌జీఏ ప్లాటూన్ నంబరు 26 కట్టే కల్యాణ్ ఏరియా డిప్యూటీ కమాండర్ జోగా (30) ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ దీపక్‌ఝూ తెలిపారు.
Advertisement
Next Story