organ donation day : అవగాహన లేమితో వేల మందికి దొరకని ఆర్గాన్స్

by Shyam |   ( Updated:2021-08-13 04:59:47.0  )
organ donation day : అవగాహన లేమితో వేల మందికి దొరకని ఆర్గాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ప్రతి పది మందిలో ఒకరు మూత్రపిండ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారే ఉన్నారు. వీరు ఎన్నో ఏళ్ళుగా డయాలసిస్‌తో, మరికొందరు చావుబతుకుల్లో ఉండి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురుచూస్తూనే ఎంతో మంది ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇలా జరగకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన తెచ్చేలా ఆగస్టు 13 న అవయవదాన దినోత్సవాన్ని జరుపుతారు. ఇలా అవయవదానం చేయాలని ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో చైతన్యం రావడం లేదు. దీంతో చనిపోయిన వ్యక్తి మరో వ్యక్తికి జీవం పోసేందుకు వీలు కలగడం లేదు.

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు. కానీ ప్రస్తుతం అన్ని దానాల కంటే అవయవదానం అన్నింటి కంటే గొప్పది. అమ్మ జన్మనిస్తోంది అవయవదానం పునరుజ్జీవనం ఇస్తుందని అంటారు. అంటే ఓ వ్యక్తి తాను మరణించాక తన శరీరంలోని 200 వివిధ ఆర్గాన్లతో 8 మందికి జీవితాన్ని ఇవ్వొచని జీవన్ దాన్ సంస్థ చెబుతోంది. దేశంలో నిత్యం వందల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందులో ఎక్కువగా బ్రెయిన్ డెడ్‌తో మరణిస్తున్నవారు అధికంగా ఉంటున్నారు. ఇలాంటి వారి ఆర్గాన్స్‌ని డొనేట్ చేసే విధంగా డాక్టర్లు అవగాహన కల్పిస్తున్నా వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో జీవితాన్ని ప్రసాధించలేకపోతున్నారు. వివిధ కారణాలతో చనిపోయిన వారి ఆర్గాన్స్ కంటే బ్రెయిన్ డెడ్ కేసుల ఆర్గాన్స్ పైనే ఇప్పుడు జీవన్ దాన్ ఆధారపడాల్సి వస్తోంది. అయితే దీని ద్వారా రాష్ట్రంలో సంవత్సరానికి కేవలం 500 ఆపరేషన్లు మాత్రమే చేయగలుగుతున్నట్లు ప్రకటించారు. కానీ జీవన్ దాన్‌లో అప్లై చేసుకున్న వారు వేలల్లో ఉంటున్నారు. తెలంగాణ‌లో కిడ్నీలు కావాలని 1733 మంది జీవన్ దాన్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇలా సరిపడా అవయవాలు అందుబాటులో లేక యేటా 3వేల మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని జీవన్ దాన్ తెలిపింది. అయితే కరోనా కారణంగా అవయవదానం చాలా తగ్గిందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed