గృహహింసకు వ్యతిరేకంగా స్వరం పెంచాలి : మానుషి

by Shyam |   ( Updated:2023-07-28 06:21:42.0  )
గృహహింసకు వ్యతిరేకంగా స్వరం పెంచాలి : మానుషి
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస పెరిగిపోతుండగా, దీనిపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి ‘ఆరెంజ్ ది వరల్డ్’ అనే అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో భాగంకాగా.. అన్ని ఏజ్ గ్రూప్స్‌కు చెందిన మహిళలు చాలా పెద్ద రిస్క్‌ను ఎదుర్కొంటున్నారని, నేను కూడా ఓ మహిళ కావడం హృదయ విదారకంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురైంది.

‘ప్రపంచవాప్తంగా మహిళలు వివిధ రూపాల్లో హింసను ఎదుర్కొంటున్నారు. అందుకు వ్యతిరేకంగా స్వరం పెంచాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మహిళా సాధికారతకు మనవంతు సాయం అందించాలి. కొవిడ్ 19 మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి గృహహింస కేసులు మరింత పెరిగాయి. కొవిడ్ 19 నుంచి బయటపడుతున్న వేళ.. మహిళలకు సురక్షితమైన ప్రపంచాన్ని పునర్నిర్మించడానికి కూడా చురుగ్గా పని చేయాలి. వారికి లింగ సమానత్వాన్ని కూడా అందించాలి’ అని మానుషి చిల్లర్ అభిప్రాయపడింది.

కాగా ‘పృథ్వీరాజ్’ అనే సినిమాతో ఈ ఏడాదే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది మానుషి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ పోషిస్తుండగా, యశ్ రాజ్ బ్యానర్స్ నిర్మిస్తోంది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహన్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తుండగా, మానుషి సంయోగిత పాత్రలో కనిపించనుంది.

Advertisement

Next Story