లాయర్లు న్యాయం కోసం పోరాడాలి : ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సురేష్

by Sridhar Babu |
లాయర్లు న్యాయం కోసం పోరాడాలి :  ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సురేష్
X

దిశ, మణుగూరు : సమాజంలో న్యాయవాద వృత్తి గౌరవ ప్రదమైనదని మణుగూరు ఇన్చార్జి ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సురేష్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలోని కోర్టు ఆవరణలో జరిగిన సీఓపీ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆఫ్ హైదరాబాద్ జారీ చేసిన నూతన ఐడెంటిటీ కార్డ్స్, అడ్వొకేట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ సీఓపీలను మణుగూరు న్యాయవాదులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. సమాజంలో న్యాయవాద వృత్తి ఎంతో గౌరవప్రదమైనదన్నారు. ప్రజలకు(కేసు భాదితులకు)సరైన న్యాయం అందించడంలో న్యాయవాదులు బలంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్మ విజయరావు, ఏపీపీ దుర్గాబాయి, సెక్రటరీ రామ్మోహన్ చారి, న్యాయవాదులు రామకోటయ్య, కందిమల్ల నరసింహారావు, నగేష్ కుమార్, అశోక్, పోశం భాస్కర్, మేదరమెట్ల శ్రీనివాస రావు, శైలజ, కవిత, సంధ్య, రవీంద్ర సర్వేశ్వర రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed