- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మార్వోలకు వినతిపత్రం.. ప్రభుత్వాలకు హెచ్చరిక
దిశ, మణుగూరు: రైతులు పండించిన పంటను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలని పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ చందా సంతోష్, కో-కన్వీనర్ గురిజాల గోపి, కరకగూడెం మండల అధ్యక్షుడు-ఏబ్లాక్ కో-ఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మణుగూరు టౌన్ అధ్యక్షుడు పిరనాకి నవీన్ డిమాండ్ చేశారు. పీసీసీ, డీసీసీ ఆదేశాల మేరకు రైతులు పండించినపంటను కొనుగోలు చేయాలని కరకగూడెం, మణుగూరు ఎమ్మార్వోలకు బుధవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… రైతులు పండించిన పంటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని, మద్దతు ధర ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. తడిసిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తప్పక కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. రైతులు పండించిన పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని, రైతులకు మద్దతు పలకాలని నాయకులు కోరారు. లేనిచో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు, నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలమురి రాజు, ఎండీ రషీద్, అరీఫ్ పాషా, నాగేశ్వరరావు, బూర్గుల నరసయ్య, సాయినేని వెంకటేశ్వర్లు, మురళి, మహిళ నాయకులు శబనా, రజినీ, సౌజన్య, కరకగూడెం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.