కోలుకుంటున్న తయారీ పరిశ్రమ : ఆర్‌బీఐ డేటా!

by Shamantha N |
కోలుకుంటున్న తయారీ పరిశ్రమ : ఆర్‌బీఐ డేటా!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తయారీ పరిశ్రమ డిమాండ్ 4.3 శాతం స్వల్ప ప్రతికూలతతో రికవరీ స్థితికి చేరుకుంటోందని ఆర్‌బీఐ డేటా తెలిపింది. తొలి త్రైమాసికంలో తయారీ రంగం కొవిడ్-19, సంబంధిత కారణాలతో అమ్మకాల పరంగా 41.1 శతం కుదించుకుపోయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ రంగం పనితీరుపై విశ్లేషించిన ఆర్‌బీఐ డాటా రికవరీ పరిస్థితులకు ముఖ్యంగా ఇనుము, ఉక్కు, ఆహార ఉత్పత్తులు, సిమెంట్, ఆటోమొబైల్, ఔషధ పరిశ్రమలు దోహదపడ్డాయని పేర్కొంది. పరిశీలించిన ఈ త్రైమాసికంలో తయారీ కంపెనీలు మొత్తం రూ. 5,99,479 కొట్ల విలువైన అమ్మకాలను నమోదు చేశాయి.

ఇది జూన్ త్రైమాసికంలో రూ. 3,97,233 కోట్లుగా నమోదైంది. దేశీయంగా 2,637 లిస్టెడ్ ప్రభుత్వేతర కంపెనీల ఆర్థిక ఫలితాల నుంచి ఈ డేటాను సేకరించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. టెలికమ్యూనికేషన్, రియల్ ఎస్టేట్ కంపెనీలు అమ్మకాలు విస్తరణను చేపట్టడంతో ఐటీయేతర సేవల రంగం కూడా 14.5 శాతం తక్కువ సంకోచాన్ని నమోదు చేసింది. ఇక ఐటీ రంగ కంపెనీల అమ్మకాల వృద్ధి 3.6 శాతంతో స్థిరంగా ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. ఖర్చుల్లో పొదుపు కారణంగా తయారీ సంస్థల నిర్వహణ లాభాలు పెరిగాయని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed