‘ఫ్యామిలీ మ్యాన్ 2’ డబ్బింగ్‌లో మనోజ్ బాజ్‌పాయ్

by Shyam |   ( Updated:2020-09-13 02:50:06.0  )
‘ఫ్యామిలీ మ్యాన్ 2’ డబ్బింగ్‌లో మనోజ్ బాజ్‌పాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు.. మనోజ్ బాజ్‌పాయ్ లీడ్ ‌రోల్‌లో నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత సక్సెస్ సాధించిందో తెలిసిందే. ప్రియమణి ముఖ్య పాత్ర పోషించిన ఈ సిరీస్‌కు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. ఇక కరోనా పాండమిక్ కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్.. ఎట్టకేలకు అక్టోబర్‌లో విడుదలయ్యే చాన్స్ ఉంది. సెకండ్ సీజన్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా.. మనోజ్ బాజ్‌పాయ్ డబ్బింగ్ షురూ చేసినట్లుగా సోషల్ మీడియా ద్వారా ఓ ఫొటోను పంచుకున్నారు.

ప్రేక్షకులకు సినిమాను మించిన థ్రిల్‌ను అందిస్తున్న వెబ్ సిరీస్‌ల్లో ‘ఫ్యామిలీ మ్యాన్’ కూడా ఒకటి. ఈ సిరీస్ మొదటి సీజన్ సక్సెస్ కావడంతో.. రెండో సీజన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు, సీజన్-2లో ఈ సారి సమంత కూడా భాగమవడంతో మరింత ఆసక్తి నెలకొంది. అందులోనూ సామ్‌ది నెగెటివ్ రోల్ అని తెలిశాక మరింత క్రేజ్ ఏర్పడింది. సమంత ఇటీవలే తన రోల్‌కు డబ్బింగ్‌ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం మనోజ్ బాజ్‌పాయ్ కూడా తన డబ్బింగ్ షురూ చేయగా, అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఇక ప్రియమణి కూడా ఇందులో ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే.

Read Also…

నేను కూడా వాటికి బానిసయ్యా : కంగనా

Advertisement

Next Story