‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’కు ‘తాండవ్‌’తో సంబంధం లేదు: మనోజ్ భాజ్‌పాయ్

by Shyam |
Manoj Bajpayee
X

దిశ, సినిమా: సైఫ్ అలీ‌ఖాన్ లీడ్ రోల్ ప్లే చేసిన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ ‘తాండవ్’ కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసిందంటూ దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కావాలనే అమెజాన్ డిలే చేసిందని అనుమానించారు నిపుణులు. ‘తాండవ్’ నెగెటివ్ ఎఫెక్ట్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’పై పడుతుందనే భయంతోనే రిలీజ్ లేట్ అయిందని అనుకున్నారు. కానీ ఇదంతా ఇమాజినేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు మనోజ్ బాజ్‌పాయ్. ‘తాండవ్’ ఎపిసోడ్ జరిగే సమయానికి ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ రిలీజ్‌కు సిద్ధంగా ఉందన్నాడు.

కానీ ‘తాండవ్’ కారణంగా తాము వెనకడుగు వేయలేదని, తమ సిరీస్ కంటెంట్‌పై దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనల గురించి ఆలోచించామని తెలిపాడు. అయితే క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే తమ కంటెంట్‌పై పూర్తి నమ్మకంగా ఉన్నారని, ఒక్కసారి సిరీస్ చూస్తే ప్రేక్షకులు తప్పకుండా అర్థం చేసుకుంటారనే ధీమాతో ఉన్నామని తెలిపాడు. దీనిపై డిబేట్స్ పూర్తయ్యాక సిరీస్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యామన్న మనోజ్.. ముందుగా చెప్పినట్లు ఫిబ్రవరి 12న రిలీజ్ కావాల్సిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ జూన్‌లో విడుదలైందని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed