మంజ్రేకర్‌పై ‘సీఎస్‌కే ట్రోలింగ్’

by Shyam |   ( Updated:2020-03-15 04:21:23.0  )
మంజ్రేకర్‌పై ‘సీఎస్‌కే ట్రోలింగ్’
X

బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌ను తొలగించిన విషయం తెలిసిందే. కాగా ఇదే అంశంపై మంజ్రేకర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టింది. ఇకపై ‘బిట్స్ అండ్ పీసెస్’ గొంతు వినాల్సిన అసరం లేదని అతడిని ఉద్దేశించి ట్వీట్ చేసింది. వరల్డ్ కప్ సమయంలో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను జడేజా వంటి ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్‌కు అభిమానిని కాదని అన్నాడు. దీనికి జడేజా కూడా అప్పట్లో ‘నీ కంటే రెండింతలు ఎక్కువ మ్యాచులు ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నాను. కొంచెం నోటి దురుసు తగ్గించుకొని ఇతరులను గౌరవించడం నేర్చుకో’ అని ఘాటుగానే స్పందించాడు.

ఇక రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు కావడంతో సీఎస్‌కే కూడా స్పందించింది. ప్రస్తుతం అతని వ్యాఖ్యానాన్ని ‘బిట్స్ అండ్ పీసెస్‌గా’ అతడిని పోల్చుతూ ట్వీట్ చేసింది.

tags : BCCI, Panel commentary, CSK, Manjrekar, Ravindra Jadeja, Bits and Pieces,

Advertisement

Next Story