Prakasham: భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని సెల్ టవర్ ఎక్కిన సామాన్యుడు

by Ramesh Goud |
Prakasham: భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని సెల్ టవర్ ఎక్కిన సామాన్యుడు
X

దిశ, వెబ్ డెస్క్: భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని ఓ సామాన్యుడు సెల్ టవర్(Cell Tower) ఎక్కి నిరసన(Protest) తెలిపాడు. ప్రకాశం జిల్లా(Prakasham District) సింగరాయకొండ(Singrayakonda) మూలగుంటపాడు(Moolaguntapadu)కు చెందిన ఆయుబ్ ఖాన్(Ayub Khan) అనే వ్యక్తి ఇవాళ ఉదయం సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు గ్రామంలో పేదల ఇళ్ల స్థలాలు రాజకీయ నాయకులు కబ్జాలు చేశారని, రాజకీయ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆయుబ్ ఖాన్ టవర్ దిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో కొందరు రాజకీయ నాయకులు పేదల ఇళ్ల స్థలాలు కబ్జా చేశారని, దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశానని, తనని మతిస్థిమితం లేని వ్యక్తిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని చెప్పారు. అంతేగాక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సెల్ టవర్ ఎక్కి ఎస్ఐ వచ్చి హామీ ఇచ్చే వరకు నిరసన తెలిపానని చెప్పుకొచ్చాడు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed