- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు సీపీ పిలుపు

దిశ,హనుమకొండ : మావోయిస్టులు అజ్ఞాత వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. గత ఫిబ్రవరి 21వ తారీఖున వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ఆమె పై ప్రభుత్వం ప్రకటించిన రూ.నాలుగు లక్షల రివార్డ్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా లొంగిపోయిన మహిళ మావోయిస్టు కు అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అడవి బాట పట్టిన మావోయిస్టులు హింసను వదిలి జనం మధ్యలోకి రావాలని, లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను అందుకొని మీ కుటుంబాలతో ప్రశాంతంగా కొనసాగించవలసిందిగా పోలీస్ కమిషనర్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ లు జితేందర్ రెడ్డి, తిరుమల్, కాజీపేట ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.