HCU గురించి మాట్లాడే అర్హత ప్రధాని మోడీకి లేదు.. మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్

by Gantepaka Srikanth |
HCU గురించి మాట్లాడే అర్హత ప్రధాని మోడీకి లేదు.. మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అరాచకం చేస్తోందని.. బుల్డోజర్లతో పర్యావరణాన్ని విధ్వంసం చేసేందుకు కంకణం కట్టుకున్నదని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఆరోపించారు. తాజాగా మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. హెచ్‌సీయూ భూములపై మాట్లాడే అర్హత ప్రధాని మోడీకి లేదని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తున్న విధ్వంసాలు, చెట్ల నరికివేతలు ప్రధానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి చిల్లి గవ్వ ఇవ్వని ప్రధానికి.. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని అన్నారు. ఇక్కడి నేతలు ఏదో చెప్పగానే విమర్శలు చేసిన ప్రధానికి.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? అని అన్నారు. రైతులకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించాం, నిరుద్యోగుల కోసం 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. రైతులకు రుణమాఫీ చేశాం, రైతు భరోసా ఇస్తున్నాం. ఇవేవీ ప్రధానికి కనిపించకపోవడం దారుణమని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని.. ముందు ఆ హామీని నిలబెట్టుకోవాలని హితవు పలికారు.



Next Story

Most Viewed