రేపే నామినేషన్ వేయబోతున్నా: పాకా వెంకట సత్యనారాయణ

by srinivas |
రేపే నామినేషన్ వేయబోతున్నా: పాకా వెంకట సత్యనారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: మంగళవారమే నామినేషన్ వేయబోతున్నట్లు బీజేపీ రాజ్యసభ అభ్యర్థి పాకా వెంకట సత్యనారాయణ(BJP Rajya Sabha candidate Paka Venkata Satyanarayana) తెలిపారు. ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ స్థానానికి బీజేపీ తరపున ఆయనను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నామినేషన్ వేసేందుకు వెంకట సత్యనారాయణ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పని చేశానని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(BJP President Purandeshwari), పార్టీ కేంద్రమంత్రులు తనపై విశ్వాసం ఉంచినందుకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని వెంకట సత్యనారాయణ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed