ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో నిరసన.. సమ్మెకు సిద్ధమంటూ నినాదాలు

by Aamani |
ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో నిరసన.. సమ్మెకు సిద్ధమంటూ నినాదాలు
X

దిశ,రాంనగర్ : ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని టంగుటూరి అంజయ్య కార్మిక సంక్షేమ భవనం వద్ద ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని,లేకుంటే సిద్ధం సిద్ధం సమ్మెకు సిద్ధం అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ,యాజమాన్య మొండివైఖరి మానుకోవాలి అని హెచ్చరిస్తూ నినాదాలు కొనసాగిస్తున్నారు.

Next Story

Most Viewed