బంపర్ ఆఫర్ ప్రకటించిన ‘జాట్’ టీమ్.. గెలిస్తే ఏకంగా రూ.5 లక్షలు పొందే అవకాశం! (ట్వీట్)

by Hamsa |   ( Updated:7 April 2025 12:12 PM  )
బంపర్ ఆఫర్ ప్రకటించిన ‘జాట్’ టీమ్.. గెలిస్తే ఏకంగా రూ.5 లక్షలు పొందే అవకాశం! (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), స్టార్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’. ఇప్పటికే పలు హిందీ, తెలుగు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన ఈ చిత్రంతో హీరోగా మారబోతున్నాడు. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), పీపుల్ మీడియా బ్యానర్స్‌పై భారీ బడ్జెట్తో నవీన్ ఎర్నేని, యలమంచలి రవి శంకర్(Ravi Shankar), టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సయామీ ఖేర్, రెజీనా, వినీత్ కుమార్ సింగ్(Vineet Kumar Singh) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) ఐటమ్ సాంగ్ చేయనుంది.

అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి రానుంది. ఇక ఇప్పటికే ‘జాట్’విడుదలై పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్ని మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే విడుదల తేదీ దగ్గరపడటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. గెలిస్తే విన్నర్‌కు (ఫస్ట్ ప్లేస్) ఏకంగా రూ. 5లక్షలు, సెకండ్ అండ్ 6 స్థానాల్లో ఉన్నవారికి రూ. 1 క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దాని కోసం ఏం చేయాలో కూడా ఓ లిస్ట్ ప్రిపేర్ చేసి నెట్టింట పెట్టారు.

ఇన్‌ఫ్లుయెన్సర్, యాక్టర్, డాన్సర్, సింగర్ లేదా కంటెంట్ క్రియేటర్‌లా? అయితే ఈ మంచి అవకాశం మీకోసమే అని తెలిపారు. ‘‘జాత్ చిత్రం గురించి ప్రత్యేక కంటెంట్ క్రియేట్ చేసి ఒక రీల్‌ను పోస్ట్ చేయండి. అలాగే ఈ సినిమా గురించి మీ ఆలోచనలు లేదా సిద్ధాంతాలను మాతో పంచుకోండి. ట్రైలర్ నుండి ఒక సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయండి. సినిమా పాటకి డ్యాన్స్ చేయాలి. ట్రైలర్‌పై మీ రియాక్షన్ ఇవ్వండి. జాట్ ట్రాక్ కవర్‌ని పాడండి. లేదా ‘జాట్’ చిత్రాన్ని మీరు ప్రచారం చేయండి. ఇవన్నీ పీపుల్ మీడియా#PMF@peoplemediafactory, #MMM@mythriofficial అని ట్యాగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయండి’’ అని రాసుకొచ్చారు. అలాగే ఏప్రిల్ 9న ముంబైలో విన్నర్‌ను ప్రకటిస్తామని రెడ్ కార్పెట్‌పై నడిచే చాన్స్ అందుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed