- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Harish Rao: తొందరపాటు పనిచేయదు.. డీజీపీపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. పోలీసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అరెస్టు, బెయిల్ వ్యవహారంపై ఇవాళ ఉదయం హైదరాబాద్ కోకాపేటలోని తన నివాసం వద్ద హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీనిస్తున్నాయని, 23% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. ఎన్ సీఆర్ బీ రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఎల్లో జోన్ లో ఉందని ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు వెళ్లే ప్రమాదముందన్నారు. ఇదే జరిగితే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హోం శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం తన బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని ధ్వజమెత్తారు. ఇకైనానా కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలన మీ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి హితవు పలికారు.
ఇంతకంటే స్పీకర్ కు ఇంకేం ఆధారాలు కావాలి?
చోర్ ఉల్టా కొత్వాల్ కే డాంటి అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ (sanjay) మా ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలంటున్నాడు. నిజానికి చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పైన అని హరీశ్ రావు అన్నారు. తక్షణమే సంజయ్ ని అనర్హుడిగా ప్రకటించే బాధ్యత స్పీకర్ పై ఉందన్నారు. సంజయ్ పార్టీ మారి వచ్చారని ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతున్నాడు. సంజయ్ పై చర్యలకు ఇంతకంటే స్పీకర్ కు ఆధారాలు ఏం కావాలన్నారు. ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. సుప్రీంకోర్టులో మాకూ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి. న్యాయం నిలబడుతుందన్నాకు. అనర్హత వేటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పడుతుందని నిజాయతీ ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచి సంజయ్ మాట్లాడాలన్నారు.
డీజీపీ గుర్తుపెట్టుకోండి..
రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనిచేయదని ఈ విషయాన్ని డీజీపీ (DGP) విషయం గుర్తు పెట్టుకోవాలని హరీశ్ రావు అన్నారు. బెయిలబుల్ సెక్షన్స్ లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం అని ఇలాంటి కేసుల్లో నాయకులు చెబితే వినడం కాదు, చట్టాలకు లోబడి పని చేయాలన్నారు. బెయిలబుల్ కేసులు అని తెలిసి కౌశిక్ రెడ్డిని రాత్రంతా ఇబ్బంది పెట్టారు. కావాలని పండుగ పూట డెకాయిట్ నో, టెర్రరిస్ట్ నో అరెస్ట్ చేసినట్టు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఎలా వ్యవహరించాలో అనేదానిపై పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలని డీజీపీని కోరారు. కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు ఉంటే అవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పెట్టినవే అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించింది మీరు కాదా? కలెక్టర్ ఆహ్వానం మేరకు కౌశిక్ రెడ్డి మీటింగ్ కు వెళ్లారు. పిలువని పేరంటానికి ఆయన వెళ్లలేదు. మీటింగ్ లో సభ్యుడిగా నువ్వే పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని ప్రశ్నించాడు. ఇందులో తప్పేముందన్నారు.
ఒక కౌశిక్ రెడ్డి కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. పార్టీ మారిన పదిమంది శాసనసభ్యులను ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, బీఆర్ఎస్ పార్టీ బట్టలిప్పుతా అని సంజయ్ అంటే ఎలా ఊరుకుంటారు?. నువ్వే పార్టీ తరపున మాట్లాడుతున్నామని అడిగారు. ఇలా ప్రశ్నించడంలో కౌశిక్ రెడ్డి తప్పేం లేదన్నారు. దీనికి మూడు కేసులు పెడతారా. ఒక సంఘటన మీద ముగ్గురు వేర్వేరు ఫిర్యాదులు తీసుకుని కేసులు పెడతారా? మీ కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసులు ఇవి. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం. ఇటువంటి చర్యలు ఇప్పటికైనా మానుకోవాలని డీజీపీని అప్పీల్ చేస్తున్నానన్నారు. పండుగ పూట పోలీసులను కూడా ఇబ్బందులు పెట్టడం, టెన్షన్ పెట్టడం సరికాదు. సంజయ్ కౌశిక్ రెడ్డి ని కూడా నెట్టారు ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదు కేవలం కౌశిక్ రెడ్డి మీదనే ఎందుకు కేసు నమోదు చేశారు. ఇందులోనే మీ పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు.