BCCI : టీమిండియా ప్లేయర్లకు 10 పాయింట్లతో క్రమశిక్షణ గైడ్‌లైన్స్ జారీ

by Sathputhe Rajesh |
BCCI : టీమిండియా ప్లేయర్లకు 10 పాయింట్లతో క్రమశిక్షణ గైడ్‌లైన్స్ జారీ
X

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ 10 పాయింట్లతో ఆటగాళ్లకు క్రమశిక్షణ గైడ్ లైన్స్ జారీ చేసినట్లు తెలిసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించనున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వివరాలు వెల్లడించాయి. ఆటగాళ్లు పర్సనల్ స్టాఫ్ (కుక్, హెయిర్ డ్రెస్సర్స్, స్టయిలిస్ట్‌లు, పర్సనల్ సెక్యూరిటీ గార్డ్)లతో ఇక నుంచి ప్రయాణించడానికి అనుమతి నిరాకరించినట్లు తెలిసింది.

బీసీసీఐ తెచ్చిన నిబంధనలివే..

దేశవాళీ క్రికెట్‌లో ఆటగాళ్లు తప్పనిసరిగా ఆడితేనే జాతీయ జట్టులోకి తీసుకోవడం, సెంట్రల్ కాంట్రాక్ట్‌కు అర్హతగా పరిగణించనున్నారు. ఆటగాళ్లు తమ ఫ్యామిలీలతో కాకుండా జట్టుతోనే మ్యాచ్‌లు, ప్రాక్టీస్‌లో పాల్గొనేందుకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆటగాళ్లకు బ్యాగేజ్ విషయంలో సైతం లిమిట్ విధించనున్నారు. పర్సనల్ స్టాఫ్‌ను ఆటగాళ్లు తమ వెంట తీసుకెళ్లాలంటే బీసీసీఐ అనుమతి తప్పనిసరి. ఆటగాళ్లు తమ క్రీడా సామాగ్రి, వ్యక్తిగత లగేజీకి సంబంధించిన బ్యాగులను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు మాత్రమే తరలించాలి.

ప్రాక్టీస్ సెషన్‌కు అందరూ ఆటగాళ్లు హాజరు కావాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సిరీస్‌లు ఆడే సమయంలో ప్లేయర్స్ ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనడానికి వీళ్లేదు. కేవలం క్రికెట్‌పై మాత్రమే వీరు ఫోకస్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ట్రావెల్ పాలసీని సైతం రూపొందించినట్లు సమాచారం. 45 రోజుల పాటు సిరీస్ ఉంటే కేవలం రెండు వారాలు మాత్రమే కుటుంబంతో గడిపేందుకు అవకాశం కల్పించనున్నారు. ఆటగాళ్లంతా బీసీసీఐ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. సిరీస్ ముగిసేంత వరకు ఆటగాళ్లు జట్టుతోనే ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ మ్యాచ్ అనుకున్న సమాయానికి ముందుగా ముగిసినా.. జట్టుతో ఉండడం ద్వారా యూనిటీ పెరుగుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed