- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీజీ సెట్‌పై గ్రామాల్లో విస్తృత ప్రచారం
దిశ,ఖిలా వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకులాల్లో ఐదో తరగతి మొదలుకొని, 9వ తరగతి వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పోస్టర్లను, కరపత్రాలను ముద్రించారు. ఎస్సీ గురుకుల సెక్రటరీ డాక్టర్ అలుగు వర్షిణి ఆదేశాలతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విస్తృతంగా గ్రామాలకు తరలి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జోన్ 3 గురుకులాల అధికారి ప్రత్యూష టీజీ సెట్ గురించి ఆమె పరిధిలో ఉన్న ప్రిన్సిపాల్ కు, ఉపాధ్యాయులకు సూచించడంతో వారు సైతం గురుకుల విద్యార్థుల నూతన దరఖాస్తుల కోసం ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు.
మానకొండూరు ప్రిన్సిపాల్ గోలి జగన్నాథం,పీటీ జె ప్రవీణ్ ప్రచారంలో పాల్గొన్నారు.ప్రభుత్వం ఇచ్చిన గురుకులాల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారాన్ని గురుకుల ప్రిన్సిపాల్ లు, ఉపాధ్యాయులు చేపట్టడం హర్షనీయమని ప్రజలు, తల్లిదండ్రులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమా దామోదర్ తో పాటు పీటీ జె, ప్రవీణ్ , కాంగ్రెస్ జిల్లా నాయకులు గజ్జెల శ్యామ్ , కాంగ్రెస్ డివిజన్ నాయకులు బైరబోయిన రవి యాదవ్ ,బజ్జురి ప్రసాద్ ,పులి చేరి రాజేష్ ,బొల్లం భరత్ ,కట్టమలు ,శ్రీధర్ ,గండు శివ , క్రిష్ణ , సురేష్ పాల్గొన్నారు