చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి..

by Aamani |
చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి..
X

దిశ, దామరగిద్ద : పండగ పూట ఓ ఇంట్లో విషాదం నెలకొంది. తెల్లారేసరికి పండుగ వాతావరణం వచ్చిందనుకున్నా ఆ కుటుంబంలో విషాదఛాయలు... కన్నీటి రోదనలు వినిపించాయి. దామరగిద్ద మండలం లక్ష్మీపూర్ గ్రామంలో చేపల వేటకు వెళ్లిన పాండు (35) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. హైదరాబాదులో కూలి పని చేసుకుంటున్న పాండు పండుగ ఉన్నందున స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో తన వెంట ఓ చిన్నారిని వెంట తీసుకెళ్లి చేపలు పట్టేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు.

వల వేసే ప్రయత్నం లో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లగా పాండు జాడ కనిపించలేదు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. చెరువులో నుంచి పాండు మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed