Tamil Nadu: పండుగ పూట తప్పిన పెను ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

by Ramesh N |
Tamil Nadu: పండుగ పూట తప్పిన పెను ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి పండుగ పూట తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం తమిళనాడులోని విల్లుపురం రైల్వే స్టేషన్ సమీపంలో పుదుచ్చేరి నుంచి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. పెద్దశబ్దం రావడంతో వెంటనే లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే భయభ్రాంతులకు గురైన ప్రయాణికులను రైలు నుంచి కిందకు దిగి పరుగులు తీశారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా రైలు నుంచి బయటకు దించామని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే సిబ్బంది చెబుతున్నారు.

రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. రైల్వే అధికారులు, ఇంజనీర్లతో సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. పట్టాలు తప్పిన రైలులో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఇతర రైళ్లు వెళ్లేందుకు మార్గాన్ని క్లియర్ చేశారు. కాగా, ఉదయం 5:25 గంటలకు విల్‌పురం నుంచి బయలుదేరిన మేము (మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలు ఒక క్రాస్ దాటుతుండగా, కోచ్‌లు పట్టాలు తప్పాయి. వెంటనే లోకో పైలట్ రైలును ఆపాడు.

Advertisement

Next Story

Most Viewed