పండుగ మీకే కాదు.. మాకు కూడా..

by Aamani |
పండుగ మీకే కాదు.. మాకు కూడా..
X

దిశ,భైంసా : సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు,పిండి వంటలు, గాలిపటాలు. పట్టణంలోని కిసాన్ గల్లీ లో ఉదయం వేళలో పండుగ శోభను సంతరించుకునే విధంగా వేసే ముగ్గులు,వాటి మధ్య ఉంచే గొబ్బెమ్మలు, చిరుధాన్యాలు,పండ్లను చూసి కోతులు ముగ్గు ముగ్గు కొ కోతి అన్నట్టు ప్రత్యక్షమై హల్ చల్ చేశాయి.ముగ్గు ముగ్గుకో కోతిని చూసిన జనాలు ముగ్గుల మధ్యలో ఉన్నటువంటి చిరుధాన్యాలు,పండ్లను తింటూ రంగురంగుల ముగ్గులను చూస్తున్నాయనీ సెటైర్లు వేస్తున్నారు.మరోపక్క నిర్మల్ జిల్లాలోనే కోతుల సంరక్షణ కేంద్రం ఉన్న కోతుల బెడద తప్పడం లేదంటూ మరికొందరు వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed