- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పై యుద్ధానికి కవర్ యువర్ ఫేస్ : మంజిమా
ఫిల్మ్ మేకర్, యాక్టర్ కార్తికేయన్ వెలప్పన్ చేపట్టిన కరోనా పై అవగాహన కార్యక్రమం “కవర్ యువర్ ఫేస్ స్టే సేఫ్”. కార్తికేయన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి కోలీవుడ్ హీరో, హీరోయిన్లు మద్దతు తెలుపుతున్నారు. తద్వారా ప్రజల్లో కరోనాను తుదముట్టించేందుకు ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కవర్ యువర్ ఫేస్ అని పిలుపునిస్తోంది హీరోయిన్ మంజిమా మోహన్. ఫేస్ ను క్లాత్ తో కవర్ చేసుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మంజీమా … మాస్క్ లు అందుబాటులో లేకపోతే శుభ్రమైన క్లాత్ ను మాస్క్ గా వినియోగించాలని కోరింది. డాక్టర్లు కూడా ఇదే సూచిస్తున్నారని తెలిపింది. మీ మొహాన్ని క్లాత్ తో కవర్ చేయడం వల్ల కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపింది. ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని… దేశాన్ని కాపాడాలని కోరింది.
కాగా మంజిమా మోహన్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ” సాహసం శ్వాసగా సాగిపో ” సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా చేసింది. కాగా దేశంలో N95 మాస్క్ ల కొరత ఉందని… కాబట్టి హాస్పిటల్లో కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుతున్న వైద్య సిబ్బందికి అవి చాలా అవసరమని… మనం ఇళ్లలోనే మాస్క్ లు తయారు చేసుకుందామని.. మాస్క్ ఇండియా చాలెంజ్ విసురుతున్నారు మరికొందరు సెలబ్రిటీలు.
This is an awareness campaign by
filmmaker/ artist @KarthikVHere. Doctors recommend even a clean piece of cloth if masks are unavailable. Covering our face can help prevent the spread of corona.#CoverYourFace #stayhome #staysafe@LMKMovieManiac pic.twitter.com/nbnZ3FQBbU— Manjima Mohan (@mohan_manjima) April 14, 2020
Tags: Cover Your Face, Stay Safe, Manjima Mohan, Kollywood, Tollywood