మనస్ఫూర్తిగా కోరుకున్నా.. నిజమైంది : మంజిమ

by Jakkula Samataha |   ( Updated:2020-11-11 08:20:37.0  )
మనస్ఫూర్తిగా కోరుకున్నా.. నిజమైంది : మంజిమ
X

దిశ, వెబ్‌డెస్క్:
మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రపంచం మొత్తం ఏకమై ఆ కోరిక నెరవేరుస్తుందని మళయాలీ ముద్దుగుమ్మ మంజిమా మోహన్ చెబుతోంది. నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన భామ.. మూవీ రిలీజై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తన లైఫ్‌లో జరిగిన ఇన్సిండెంట్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది. 2012లో ఓ రెస్టారెంట్‌లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ను చూసిన తను.. భవిష్యత్తులో తనతో తప్పకుండా వర్క్ చేస్తానని కాలేజ్ ఫ్రెండ్స్‌తో చెప్పిందట. మూడేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ రూపంలో ఆ కల నెరవేరిందని తెలిపింది. ఇదే సినిమా శింబు, మంజిమా హీరోహీరోయిన్లుగా ‘అచ్చమ్ ఎన్బద్ మదమైయద’ పేరుతో రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. కాగా మంజిమా ప్రస్తుతం విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్‌’లో కీ రోల్ ప్లే చేస్తోంది.

Advertisement

Next Story