మాణికేశ్వరి మాత ఇకలేరు

by Shyam |
మాణికేశ్వరి మాత ఇకలేరు
X

దిశ, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా సరిహద్దుల్లోని యానాగుంది క్షేత్రం‌లో ఉన్న మాత మాణికేశ్వరి (86) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతిక గాయాన్ని రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉదయం భక్తుల దర్శనార్థం ఉంచనున్నారు. దీంతో బుధవారం మాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో భక్తులు ఉన్నారు. మాత చివరి చూపు కోసం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Next Story