- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సాహో' నటి మందిరా బేడీ ఇంట విషాదం..
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి మందిరా బేడీ ఇంట విషాదం నెలకొంది. మందిరా బేడీ భర్త, నిర్మాత రాజ్ కౌశల్ గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం ఉదయం 4.30 గంటల సమయంలో రాజ్ కౌశల్ కి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజ్ కౌశల్, మందిరాలను ప్రేమించి 1999 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక్క కుమారుడు. అలాగే గతేడాది ఓ బాలికను కూడా దత్తత తీసుకున్నారు. ఇక రాజ్ కౌశల్ పలు హిట్ చిత్రాలను నిర్మించారు. ‘ప్యార్ మే కబీ కబీ’, ‘షాదీ కా లడ్డు’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. రాజ్ కౌశల్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక మందిరా బేడీ తెలుగులో ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story