నా ఆనందానికి తాళం చెవి తనే : మందిర బేడి

by Jakkula Samataha |
నా ఆనందానికి తాళం చెవి తనే : మందిర బేడి
X

దిశ, వెబ్‌డెస్క్ : యాంకర్ అండ్ యాక్ట్రెస్ మందిరా బేడి నాలుగేళ్ల అమ్మాయిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. జులై 28న తమ కుటుంబంలోకి మనస్ఫూర్తిగా పాపను ఆహ్వానించిన మందిర.. ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఎనిమిదేళ్ల తన కొడుకుకు చెల్లెలు కావాలని అనుకున్నామని.. అందుకే తన భర్త రాజ్ కౌశల్‌తో కలిసి పాపను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. తను మా దగ్గరికి రాకముందే ‘తార’ అని పేరు కూడా పెట్టేశామని తెలిపిన మందిర.. అక్టోబర్‌లో తన అభిమానులు, ఫాలోవర్స్‌కు సోషల్ మీడియా వేదికగా పాపను పరిచయం చేసింది.

కాగా లేటెస్ట్ పోస్ట్‌లో కూతురితో పాటు ప్యూరెస్ట్ స్మైల్ ఇస్తున్న మందిర పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘లాక్ స్టార్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో తారతో ఉన్న పిక్ లవబుల్‌గా ఉండగా.. నా సంతోషానికి తాళం, తాళం చెవి కూడా తనే అని తెలిపింది. దీంతో సెలబ్రిటీస్, ఫ్యాన్స్, ఫాలోవర్స్ మందిర పాపను చూసుకుంటున్న విధానానికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మీ మంచితనం గురించి చెప్పేందుకు పదాలు కూడా కరువయ్యాయి అంటూ ఎమోషనల్ అయ్యారు. మందిర లాగే సెలెబ్రిటీలందరూ ఆలోచిస్తే కనీసం కొంత మంది అనాథ పిల్లలైనా సంతోషంగా ఉంటారని అంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story