‘పోత మట్టిలో ఇండ్లు ఎలా నిలబడతాయి’

by srinivas |
‘పోత మట్టిలో ఇండ్లు ఎలా నిలబడతాయి’
X

దిశ ఏపీ బ్యూరో: పోతమట్టిలో ఇల్లెలా నిలబడతాయని టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ ప్రశ్నించారు. కృష్ణా నదికి, కరకట్టకు మధ్య భూములు కొనుగోలు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని చెప్పారు. రెవెన్యూ రికార్డులు సైతం తారుమారు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొక్కిలిగడ్డలో చెరువులను పూడ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక ఆర్సీ యాక్ట్‌ను ఉల్లంఘిస్తోందంటూ కూల్చేశారని గుర్తు చేసిన ఆయన, ఈ ఏడాదిలో ఏమైనా చట్టాలు మారాయా? అని ప్రశ్నించారు.

అంతే కాకుండా పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చదును చేస్తున్నామని, మట్టి పోస్తున్నామని ప్రభుత్వం చెబుతోందన్న ఆయన, అసలు నదీ ప్రాంతంలో పోత మట్టి నిలబడుతుందా? అసలు పోత మట్టిలో నిర్మాణాలు ఎలా చేస్తారు? అనుమతులు వస్తాయనుకుంటున్నారా? గతంలో వరదలు వచ్చినప్పుడు యడ్లంక వాసులు తమకు అవనిగడ్డలో స్థలాలు ఇవ్వాలని కోరితే మంత్రులు సరేనన్నారు. ఇప్పుడదే యడ్లంకలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస యోగ్యం కాని ప్రదేశాల్లో స్థలాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి? అంటూ ఆయన ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Advertisement

Next Story

Most Viewed