- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంచు పోయినా… గద్దె దింపుతాం : మందకృష్ణ
దిశ, కాటారం: ఎన్నికలకు ముందు దళితులకు మూడెకరాల భూమి అని ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నినాదాన్ని ఆచరణలో పెట్టడంలో విఫలం అయిందని, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… దళితుల ఇస్తామన్న భూమి ఇవ్వకుండా తమ ఆధీనంలో ఉన్న భూమిని కూడా లాక్కుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, స్మశానాల పేరిట భూములను లాక్కోవడం సరైన చర్య కాదని ఆయన మండిపడ్డారు. ఒక ఇంచు భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తి తమకు ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోందని, తమ ఆధీనంలో ఉన్న భూములను కాపాడుకుంటూ అధికారాన్ని కూడా చేజిక్కించుకుంటామని మంద కృష్ణ హెచ్చరించారు.
సురారంలో 25 ఏళ్లుగా భూములు స్వాధీనంలో ఉంచుకున్న దళితులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హయంలో కెటాయించిన ఈ భూములకు ఆయన తనయుడు శ్రీధర్ బాబు నాలుగు సార్లు గెలిచినా వారికి శాశ్వత పట్టాలు ఇవ్వలేకపోయాడని మంద కృష్ణ విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దళితుల హక్కులను ఏ మేరకు పరిరక్షించారన్నది స్పష్టం అయిందన్నారు. ఖచ్చితంగా మూడెకరాల భూమి లేనట్టయితే రూ.30 లక్షల నగదు బ్యాంకులో ఉండే విధంగా తాము అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.