- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి మోసాలు ప్రతి గడపకూ చెప్పాలి : మంద కృష్ణ
దిశ, హాలియా: రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కావాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం నిడమనూరులో జరిగిన ఎమ్మార్పీఎస్ వీహెచ్పీఎస్ సదస్సు నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మాదిగ జాతి రెండున్నర దశాబ్దాలుగా రాజీ లేకుండా పోరాటం చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయన్నారు. కేవలం మాదిగల ఓట్ల కోసమే వర్గీకరణ జపం చేశారు తప్ప ఆచరణలో మాత్రం చట్టబద్ధత కల్పించకుండా ద్రోహం చేశారని ఆరోపించారు. రానున్న నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాలను ప్రతి గడపకూ తెలియజెప్పే బాధ్యత తీసుకొని అన్ని గ్రామాల్లో పర్యటించాలన్నారు. మహాజన సోషలిస్టు పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఇన్ చార్జి బకరం శ్రీనివాస్, సమన్వయ కర్త జానకి రామయ్య, గడ్డం ఖాసిం, అందే రాంబాబు, బొజ్జ చిన్న, ఆడెపు నాగార్జున, బొర్రా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.