- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీవీని ఆదర్శంగా తీసుకోవాలి: మందకృష్ణ
by Shyam |
X
దిశ, న్యూస్ బ్యూరో: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు తీసుకువచ్చిన భూసంస్కరణ చట్టాన్ని మరింత పకడ్బందిగా అమలు చేయాలని ఎమ్ఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన ఆదివారం ఓ ప్రకటన చేశారు. కులతత్వ, దొరతత్వం లేని పీవీని నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి వందల ఎకరాలను పేదలకు పంచిన సౌమ్యవాది పీవీ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక స్థితి మెరుగయ్యే విధంగా సంస్కరణలతో కూడా సౌమ్యవాద విధానాన్ని మరింత జోడించినప్పుడే అభివృద్ధి, ఆర్థిక అసమానతలు లేని భారత్‌ను నిర్మించవచ్చని తెలిపారు. పాలకులు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. అప్పుడే పీవీ నరసింహారావుకు నిజమైన నివాళులర్పించిన వాళ్లమవుతామని చెప్పారు.
Advertisement
Next Story