- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటుడిగా పుట్టడం ఆశీర్వాదంగా భావిస్తున్నా : మనోజ్
దిశ, వెబ్‌డెస్క్ : సంగీతం రాళ్లను కరిగిస్తుందా లేదా తెలియదు కానీ.. మనసును తేలికపరుస్తుంది, మంచి అనుభూతిని పంచుతుంది, ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మంచి పాట విన్నప్పుడు ఒక్క క్షణం మనం ఏంటి? మన బాధలు ఏంటి? అనే విషయాన్ని మరచిపోతుంటాం. కానీ ఆ ఆనందానికి మనమే కారణమైతే ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేం కదా. అలాంటి అనుభవాన్ని పొందారు హీరో మంచు మనోజ్. రకుల్ ప్రీత్ జంటగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమా నుంచి ‘పిల్లా ఓ పిల్లా సాంగ్’ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. రీసెంట్‌గా ఆ పాట వింటూ మాటలు రాని ఓ దివ్యాంగురాలు హమ్ చేస్తున్న విధానం.. తను ఆ పాటను ఎంజాయ్ చేస్తున్న తీరు చూసి చాలా సంతోషపడ్డారు మనోజ్. పాట హిట్ అయినప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ పాట తన నోట విన్న తర్వాత ఆర్టిస్టుగా పుట్టినందుకు ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు చెప్పాడు.
https://twitter.com/ramjowrites/status/1331586801874571265?s=20
కాగా అచ్చు సంగీతం సమకూర్చగా, తాను రాసిన ఈ పాటను దివ్యాంగురాలు అంతలా ఆస్వాదిస్తుండటంపై లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి సైతం సంతోషం వ్యక్తం చేశారు. హార్డ్ వర్క్, పాషన్, హృదయ పూర్వక ప్రయత్నానికి ఫలితం ఇంత గొప్పగా ఉంటుందన్నారు. సంగీత దర్శకుడు అచ్చు ఇంద్రజాలికుడని.. ఇది తన సంగీత అభిరుచిని తెలియజేస్తుందని అన్నారు.