కూతురికి మంచు లక్ష్మి గిఫ్ట్!

by Jakkula Samataha |   ( Updated:2023-12-16 15:04:08.0  )
కూతురికి మంచు లక్ష్మి గిఫ్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. ఆన్‌లైన్ క్లాసులైతే మొదలయ్యాయి గానీ, పిల్లలు శ్రద్ధగా వింటున్నారా? లేదా? అన్నది డౌటే. ఎంతైనా ఇంట్లోనే క్లాసులు వినడమంటే తప్పకుండా ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉండే ఉంటుంది. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీ ప్రసన్న కొత్తగా ఆలోచించింది. తన కూతురు నిర్వాణ కోసం ఇంట్లోనే స్కూల్ రెడీ చేసేసి.. తనకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

విద్య అనేది భవిష్యత్తుకు పాస్‌పోర్ట్‌ లాంటిదని అభిప్రాయపడిన మంచు లక్ష్మి.. తన బిడ్డను రేపటి గురించి తయారు చేస్తున్నట్లు తెలిపింది. నిర్వాణ కూడా తనలాగే ఇండిపెండెంట్ ఉమెన్‌గా ఎదుగుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంటోంది. కాగా, 36 గంటల్లో హోమ్ స్కూల్ డిజైన్ చేయించిన మంచు లక్ష్మి.. కూతురి ఎగ్జైట్‌మెంట్ చూసి సంబరపడిపోయింది. తను కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ తన సపోర్ట్ ఉంటుందని.. తనకు అన్నింటిలో బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తానని తెలిపింది. నిర్వాణ అనుకున్న లక్ష్యం సాధించడంలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తానని.. అలాంటి అవకాశాన్ని వదులుకోనని చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed