మంచిర్యాల ఎమ్మెల్యేకు కరోనా..

by Aamani |   ( Updated:2021-07-30 03:13:51.0  )
మంచిర్యాల ఎమ్మెల్యేకు కరోనా..
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల శాసనసభ్యుడు ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు నిర్ధారించిన కోవిడ్ పరీక్షలలో పాజిటివ్ గా తేలినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “ఇటీవల కొద్దిగా దగ్గు, జ్వరంగా ఉండడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పరీక్షలలో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. డాక్టర్ సూచనల మేరకు ప్రస్తుతం తన ఇంట్లో హోం క్వారంటైన్ లో ఉంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ మధ్యకాలంలో తనను కలిసిన ప్రజలు, సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed