- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేషెంట్ల భోజనంలో జెర్రీ.. బయటపడ్డ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వాకం
దిశ, గోదావరిఖని: గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పేషంట్లకు అందించే ఆహారంలో నాణ్యత కనుమరుగవుతుంది. రామగుండంకు చెందిన సత్తమ్మ తమ బిడ్డ శారదాను 3 రోజుల క్రితం డెలివరీకి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే వారికి పెట్టిన ఆహారంలో జెర్రీ రావడంతో అవాక్కయ్యారు. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గోదావరిఖని, రామగుండం, మంథని, కాటారం, మహాదేవపూర్, తదితర ప్రాంతాల నుండి వందల సంఖ్యలో గర్భిణీ మహిళలు నిత్యం ఆస్పత్రికి డెలివరీ కోసం వస్తుంటారు.
ప్రతి నెల సుమారుగా 250కి పైగా డెలివరీలు జరుగుతాయి. అయితే వీరికి అందించాల్సిన ఆహారంలో నాణ్యత లోపించి పురుగులు దర్శనమిస్తున్నాయి. ఆదివారం గర్భిణీ మహిళలకు అందించిన ఆహారంలో జెర్రీ పురుగు రావడంతో పేషెంట్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు ప్రభుత్వ ఆస్పత్రి ఫుడ్ కాంట్రాక్టర్ అధికార పార్టీ నాయకుడు కావడంతో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సైతం ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నా.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత మంది గర్భిణీలకు అందించే ఆహారంలో కనీసం నిబంధనలు కూడా పాటించకుండా పౌష్టికాహారం కూడా అందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేషంట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు కాంట్రాక్టర్ పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు పేషంట్ల బంధువులు కోరుతున్నారు.