అనంతపురంలో దారుణ హత్య 

by srinivas |
అనంతపురంలో దారుణ హత్య 
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం రాంనగర్ 80 ఫీట్ రోడ్డులో దారుణ హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ప్రాణం తీసేవరకు వెళ్ళింది. రఫీ అనే వ్యక్తిపై తెల్లవారుజామున కత్తులతో దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రఫీ ప్రాణాలు విడిచాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. గోపినాథ్ అనే వ్యక్తి హత్య చేశాడని… రఫీ బంధువులు ఆరోపిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story