బాలికను పొలాల్లోకి ఎత్తుకెళ్లిన యువకుడు.. చిన్నారి అరుపులతో..

by srinivas |
Attempted rape
X

దిశ, వెబ్‌డెస్క్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు. అతడి చేష్టలకు భయపడిన బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో హత్య చేసేందుకు ప్రయత్నించాడు. స్థానికుల అప్రమత్తతతో బాలిక క్షేమంగా బయట పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పుల్లగుమ్మి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి గ్రామ శివారులోని పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారయత్నం చేయగా.. భయపడిని చిన్నారి ఏడుస్తూ గట్టిగా కేకలు వేసింది. సమీపంలోని పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలు బాలిక అరుపులు విని అటువైపుగా వెళ్లారు. వారిని చూసిన కామాంధువు చిన్నారిని చంపే ప్రయత్నం చేశాడు. గమనించిన రైతులు వెంటనే అతడి వైపు పరుగులు తీయడంతో బాలికపై వదిలేసి పరారీ అయ్యాడు. షాక్‌లో ఉన్న బాలికను స్థానికులు ఇంటికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు రైతులను, బాలికను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వారి సమాచారంతో పోలీసులు కామాంధుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story