- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తనను తానే పెళ్లిచేసుకున్న యువకుడు
దిశ, వెబ్‌డెస్క్ : ‘లవ్’లో ఉన్నప్పుడు ప్రేమికులు ఈ ప్రపంచాన్నే మరిచి విహరిస్తుంటారు. తమ మనసు దోచుకున్న వారితో ఏడడుగులు వేసి.. ఓ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాలని భావిస్తారు. ఈ క్రమంలో ఇంట్లో పెద్దలను ఒప్పించి ఏకమయ్యే ప్రేమ పక్షులు కొందరైతే, పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యే వాళ్లు ఇంకొందరు. ఎలా చేసుకున్నా పెళ్లి పెళ్లే. అయితే, మూడు ముళ్లు వేసే సుముహూర్తం దగ్గరికొచ్చిన వేళ.. హఠాత్తుగా తమ నిర్ణయాన్ని మార్చుకుని, తమ ప్రేయసి లేదా ప్రేమికుడికి హ్యాండ్ ఇచ్చిన ఘటనలు చాలానే చూశాం. అలా పెళ్లిదాకా వచ్చిన తర్వాత ఓ ప్రేయసి.. చివరి నిమిషంలో తన ప్రియుడితో పెళ్లికి నిరాకరించగా, ఆ వ్యక్తి ఓ వినూత్న నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
బ్రెజిల్‌కు చెందిన డియాగో రెబెలో, విటర్ బ్యూనో.. చాలాకాలం పాటు ప్రేమించుకుని గతేడాది నవంబరులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. గత అక్టోబర్‌లోనే ‘రెబెలో, బ్యూనో’ ఓ ఇంటివారు కావాల్సింది. కానీ వీరిద్దరూ చిన్న చిన్న కారణాలతో తమ ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టి.. జులైలో బ్రేకప్ చెప్పుకున్నారు. బ్యూనో నో చెప్పడంతో.. రెబెలో వివాహం ఆగిపోతుందని అందరూ భావించారు. కానీ రెబో ఇక్కడే అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. ‘ఆమె పోతే పోయింది.. నన్ను నేనే పెళ్లి చేసుకుంటాను. నాకంటే నన్ను ఇంకెవరు ప్రేమిస్తారు’ అని మనసులో అని అనుకున్నాడో ఏమో.. అక్టోబర్ 17న బాహియాలోని ఇటాకేర్ పట్టణంలో గల ఓ రిసార్ట్‌లో తనను తానే పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి 40 మంది అతిథులు హాజరయ్యారు. వివాహం అనంతరం ‘నేను సాధించాను’ అంటూ డియాగో పోస్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నెల రోజులపాటు ఏం చేయాలా అని ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు రెబెలో చెప్పాడు.
‘ఈ రోజు నా జీవితంలో ఎంతో అందమైన రోజు. ఎందుకంటే.. నా జీవితంలో నాకిష్టమైన మనుషులకు దగ్గరగా ఉన్నాను. ఓ ట్రాజెడీ.. కామెడీగా టర్న్ అయ్యినందుకు ఈ రోజు మనం పెద్ద పార్టీ చేసుకుంటున్నాం’ అని రెబెలో తెలిపాడు.